Hyderabad: బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 800 మంది..

IT Company Fraud: హైదరాబాద్ మాదాపూర్‌లో ఇన్నోహబ్ అనే ఐటీ సంస్థ బోర్డ్ తిప్పేసింది.

Arun Chilukuri
Updated on: 30 May 2022 8:45 PM IST
Innohub IT Company Fraud in Madhapur
X

Hyderabad: బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 800 మంది..

IT Company Fraud: హైదరాబాద్ మాదాపూర్‌లో ఇన్నోహబ్ అనే ఐటీ సంస్థ బోర్డ్ తిప్పేసింది. దాదాపు 20 కోట్లు వసూలు చేసి ఉడాయించింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డుపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ జాబ్స్ అంటూ నిరుద్యోగులకు ఆశపెట్టి ఒక్కొక్కరి వద్ద 2లక్షలు వసూలు చేశారు. రెండు నెలలు ట్రైనింగ్‌ ఇచ్చి జీతాలు కూడా ఇచ్చారు. ఇక టార్గెట్‌ రీచ్‌ అయ్యాక బోర్డు తిప్పేశారు. రెండు వారాల క్రితం కంపెనీ వెబ్‌సైట్స్, మెయిల్స్ బ్లాక్ చేశారు. ఇక మోసపోయామని తెలుసుకున్న బాధితులు వారం రోజుల క్రితం మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story