వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం

X
Highlights
హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బాబును ఆస్పత్రి...
Arun Chilukuri2 Nov 2020 8:09 AM GMT
హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బాబును ఆస్పత్రి సిబ్బంది కిందపడేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి వద్ద బాధితకుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. బాబుకు ఆరోగ్యం బాగాలేకనే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. మీర్‌పేట్‌కు చెందిన ప్రసన్నకు ఆపరేషన్ చేసి బాబును బయటకు తీశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చేతుల్లోంచి బాబును కిందపడేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Web Titleinfant baby died in vanasthalipuram area hospital boy relatives dharna on doctors negligence
Next Story