CM Revanth Reddy: బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తాయి

CM Revanth Reddy: పేదల కలలపై కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు

Shashank Gullapelli
Published on: 11 March 2024 3:55 PM IST
Indirammas Houses Stand As A Symbol Of The Self-Respect Of The Badugus Says Revanth Reddy
X

CM Revanth Reddy: బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తాయి 

CM Revanth Reddy: పేదల కలలపై కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాచలంలో శ్రీకారం చుట్టారు. బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. గృహ నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story