దుబాయ్‌లో తెలంగాణవాసికి 7కోట్ల లక్కీ డ్రా

X
Highlights
దుబాయ్ లక్కీ డ్రాలో తెలంగాణవాసి విజేతగా నిలిచాడు. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.7.3...
Arun Chilukuri11 Sep 2020 5:39 AM GMT
దుబాయ్ లక్కీ డ్రాలో తెలంగాణవాసి విజేతగా నిలిచాడు. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.7.3 కోట్ల లక్కీ డ్రాను గెలుచుకున్నాడు. లక్ష్మీ వెంకట తాతారావు గ్రంధి లక్కీ డ్రా కాంటెస్ట్‌లో రూ.7.3 కోట్లు గెలుచుకున్నాడని గల్ఫ్ న్యూస్ గురువారం వెల్లడించింది. దుబాయ్‌లో 1999 నుంచి ''మిలీనియమ్ మిలియనీర్" పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దీని కింద 1 మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.7.3 కోట్లు ) ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఏడాది క్రితం దుబాయ్‌కు ఉద్యోగం కోసం వెళ్లిన 34 ఏళ్ల లక్ష్మీ వెంకట తాతారావు గ్రంధి లాటరీ టికెట్ కొన్నాడు. డ్రాలో అతడే మొదటి ప్రైజ్ గెలుచుకున్నాడు. ఈ డబ్బులతో తన కష్టాలన్నీ తీరిపోతాయన్నాడు.
Web TitleIndian expat Laxmi Venkata Tata Rao Grandhi wins $1 million in Dubai
Next Story