Kollapur: కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

Kollapur: ప్రచారంలో భరత్ కుమార్ పై దాడి చేసిన దుండగులు

Jyothi
Published on: 22 Nov 2023 11:13 AM IST
Independent MLA candidate Barrelakka Younger Brother Attacked
X

Kollapur: కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

Kollapur: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) తమ్ముడు భరత్ కుమార్ ‌‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. భరత్ కుమార్ ముఖంపై కొట్టడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. తనను రాజకీయంగా ఎదుర్కొలేక తన తమ్ముడిపై దాడి పాల్పడ్డారని శిరీష ఆరోపిస్తోంది. తమకు రక్షణ కల్పించే వరకు వెళ్ళేది లేదని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బైటాయించింది. తన తమ్ముడిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story