గ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ పెంపు

Gas Connection: *కొత్త కనెక్షన్‌పై 300 బాదుడు

Sriveni Erugu
Published on: 15 Jun 2022 6:38 AM IST
Increase in gas connection deposit
X

గ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ పెంపు

Gas Connection: వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వంటగ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ను భారీగా పెంచింది. ఇప్పటివరకు 1450 రూపాయలు ఉన్న కొత్త కనెక్షన్‌ 1750 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త కనెక్షన్‌ ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు 14.2 కేజీల బరువు ఉన్న సిలిండర్‌, కొత్త కనెక్షన్‌ కావాలంటే 1450 రూపాయలు డిపాజిట్‌ చేయాలి. గ్యాస్‌తో కలిపి కొత్త కనెక్షన్‌ తీసుకోవాలంటే 2,650 రూపాయలు చెల్లించాలి. అయితే పెరిగిన కొత్త ధరల ప్రకారం అదే బరువు కలిగిన కొత్త కనెక్షన్‌ తీసుకోవాలంటే 1750 రూపాయలు డిపాజిట్‌ చేయాలి. గ్యాస్‌, రెగ్యులేటర్‌తో కలిపితే 3,300 రూపాయలు ప్రస్తుతం చెల్లించాల్సి వస్తుంది. కొత్త కనెక్షన్‌ డిపాజిట్‌ సామాన్యుడికి మరింత భారంగా మారనుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story