Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా రంగాపురంలో వైద్యం వికటించిన చిన్నారి మృతి

Mahabubabad: ఖమ్మంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి

Dhatripriya
Updated on: 12 March 2023 7:15 PM IST
In Mahabubabad District Child Died Due To Improper Treatment
X

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా రంగాపురంలో వైద్యం వికటించిన చిన్నారి మృతి

Mahabubabad: ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం రంగాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూక్య బీరన్న మహేశ్వరి దంపతుల చిన్న కుమారుడు పండుకు జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ డాక్టర్‌ భూక్యాహాలు వద్దకు తీసుకెళ్లగా ఇంజక్షన్‌ వేసి ఇంటికి పంపించాడు. కొద్ది సేపటికి బాలుడి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇంజక్షన్‌ వికటించి బాలుడు మృతి చెందాంటూ బంధువులు ఆరోపించారు. చిన్నారి చావుకు కారణమైన ఆర్‌ఎంపీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story