KTR: కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

KTR: అమలు చేయాలని ఇంఛార్జ్‌లకు మంత్రి హరీష్ రావు సూచన

Shekhar G
Published on: 13 Oct 2023 7:22 AM IST
In Charge Were Announced For The Constituencies
X

KTR: కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

KTR: BRSకు రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందని.. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇవాళ 54 నియోజకవర్గాలకు బీఆర్ఎస్‌ ఇంఛార్జ్‌లను ప్రకటించిన కేటీఆర్.. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గత పదేళ్లలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు కేటీఆర్. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ గడపకు చేరవేయాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతీ ఒక్కరితో మమేకం కావాలన్నారు. ఇక రానున్న 45 రోజుల పాటు ఇంఛార్జ్‌లు నియోజకవర్గాల్లోనే ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు. పార్టీ ప్రచారానికి పకడ్బందీ ప్రణాళికలు చేసి అమలు చేయాలని సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story