Rain Alert: బిగ్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ వార్నింగ్

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం తెలంగాణతోపాటు ఏపీ రాష్ట్రాల్లో పలు జిల్లాలాపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్ల్ అలర్ట్ ను జారీ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Oct 2024 9:13 AM IST
IMD said heavy rains will occur in Telugu states for 4 days
X

Rain Alert: బిగ్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ వార్నింగ్

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని..దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంత ఏపీ, తెలంగాణలో బారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ తోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు ఉంటుందని అంచనా వేసింది ఐఎండీ.

ఇక రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.

శనివారం ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇక తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

రేపు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story