తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

X
Highlights
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో...
Arun Chilukuri13 Oct 2020 2:19 PM GMT
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Web TitleIMD Issues Red Alert Across the State
Next Story