Nirmal: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్ధిని ఆత్మహత్య

Nirmal: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.

Arun Chilukuri
Published on: 13 Jun 2023 3:46 PM IST
IIIT-Basara Student Dies by Suicide
X

Nirmal: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్ధిని ఆత్మహత్య

Nirmal: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ ఫస్టియర్‌ చదువుతున్న దీపిక.. బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరివేసుకొంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది.. బాత్‌రూమ్‌ డోర్లు తెరిచారు. అప్పటికే ఉరివేసుకొని అపస్మారక స్థితిలో ఉన్న దీపికను హుటాహుటిన క్యాంపస్‌లోని హెల్త్‌ సెంటర్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం.. ఆమెను అంబులెన్స్‌లో భైంసా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని దీపిక మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. దీపిక ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలు దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్‌గా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story