Amarnath: వైజాగ్ లో ఒక్క ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు.. KCR వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కౌంటర్

Minister Amarnath: పదే పదే పక్క రాష్ట్రాలను కించపరచడం కరెక్ట్ కాదు

Shekhar G
Published on: 23 Jun 2023 5:05 PM IST
If You Sell One Acre In Vizag You Can Buy 150 Acres In Telangana Says Minister Amarnath
X

Amarnath: వైజాగ్ లో ఒక్క ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు.. KCR వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కౌంటర్

Minister Amarnath: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఒక్క హైదరాబాద్‌‌ అభివృద్ధిని మొత్తం తెలంగాణ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. నిన్న పటాన్‌చెరులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయన్నారు. ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని.. ఈ విషయాన్ని మాజీ సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు సీఎం కేసీఆర్.

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అమర్నాథ్ రెడ్డి.. వైజాగ్ లో ఒక్క ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చన్నారు. ఎవరిని కించపరచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలంగాణ నేతలు పదే పదే పక్క రాష్ట్రాలను కించపరచడం సమంజసం కాదన్నారు అమర్నాథ్‌.

Shekhar G

Shekhar G

Next Story