Bandi Sanjay: కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే కవితను బర్తరఫ్ చేయాలి..
Bandi Sanjay: ఢిల్లీనే కాదు.. రానున్న రోజుల్లో పంజాబ్, తెలంగాణ లిక్కర్ స్కామ్‌లు కూడా బయటకు వస్తాయని హెచ్చరించారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.
Bandi Sanjay: కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే కవితను బర్తరఫ్ చేయాలి..
Bandi Sanjay: ఢిల్లీనే కాదు.. రానున్న రోజుల్లో పంజాబ్, తెలంగాణ లిక్కర్ స్కామ్‌లు కూడా బయటకు వస్తాయని హెచ్చరించారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ తన కూతురిని కాపాడుకోవడం కోసమే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినవాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీఎం కేసీఆర్‌కు తన కూతురుని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. పోలీసులు తన పాదయాత్రను ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మళ్లీ షురూ చేస్తానని బండి సంజయ్ తేల్చిచెప్పారు. రేపు పాదయాత్ర శిబిరం వద్ద నిరాహార దీక్షకు దిగే యోచనలో సంజయ్ ఉన్నారని సమాచారం.
Next Story




