Hyderabad: ఉపరాష్ట్రపతి ప్రోగ్రామ్ ఏర్పాట్లలో అపశృతి

Hyderabad:*ప్రమాదవశాత్తు స్టేజీ మీద నుంచి కింద పడ్డ అమిరేశ్ *ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమిరేశ్ మృతి

Rama Rao
Updated on: 19 May 2022 9:00 AM IST
IB official dies After Accidental Fall Hyderabad
X

Hyderabad: ఉపరాష్ట్రపతి ప్రోగ్రామ్ ఏర్పాట్లలో అపశృతి

Hyderabad: ఇంటెలిజెన్స్‌ బ్యూరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అమిరేశ్‌ మృతి చెందారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో స్టేజ్‌ నుంచి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు బిహార్‌కు చెందిన డీఎస్పీ స్థాయి ఐబీ అధికారి అమిరేశ్‌ శిల్పకళా వేదికకు వెళ్లారు.

భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీ ముందున్న గుంతలో పడ్డారు. కింద పడడంతో ఆయన తలకు తీవ్రగాయం అయింది. వెంటనే అధికారులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అమిరేశ్‌ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమిరేశ్‌ మృతి వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అమిరేశ్‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story