Telangana: త్వరలో తెలంగాణలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు

Telangana: తెలంగాణలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 11 Jun 2021 12:15 PM IST
IAS, IPS Officers Transfers in Telangana Soon
X

సీఎం కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Telangana: తెలంగాణలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోని భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే అధికారులపై ఫైల్ రెడీ చేయించిన సీఎం కేసీఆర్.. బదిలీలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి కేబినెట్ సమావేశంలో ఐఏఎస్‌ల పనితీరును మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో బదిలీలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుండి ఒకే పోస్టులో ఉన్న పలువురు అధికారులను బదిలీ చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story