Madan Reddy: నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది

Madan Reddy: రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాను

Shekhar G
Published on: 28 Aug 2023 7:46 PM IST
I Was Wronged As Narsapur Ticket Was Not Declared Says Madan Reddy
X

Madan Reddy: నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది

Madan Reddy: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మెదక్ జిల్లాలో 9 ఎమ్మెల్యే సీట్లు ప్రకటించి నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. టికెట్ ప్రకటించకపోవడంతో తన అన్యాయం జరిగిందని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. సునీత లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. తాను నర్సాపూర్ పోటీలో ఉండటం ఖాయమని తెలిపారు. నర్సాపూర్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నట్లు వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story