Jagga Reddy: తాను ఫోన్‌లో దొరక్కపోయినా... నా సైన్యం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుంది

Jagga Reddy: కార్యకర్తలు విజయవంతం చేయాలి

Shekhar G
Published on: 21 Oct 2023 7:52 PM IST
I Dont Do Politics For Votes Says Jagga Reddy
X

Jagga Reddy: తాను ఫోన్‌లో దొరక్కపోయినా... నా సైన్యం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుంది

Jagga Reddy: తాను ఫోన్‌లో దొరికినా దొరక్కపోయినా తన సైన్యం ఎప్పుడు ప్రజలతోనే ఉంటుందని, కష్టాలు ఆపదలో ఉన్న వారికి అందుబాటులో ఉంటానని, తానేంటో చాలామందికి తెలుసని, కొందరికి తెలియని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ‎ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి హస్తం కండువా కప్పి స్వాగతించారు. తన స్టయిలే అంత అని, ఇది తన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, కొందరికి తెలియకపోవచ్చని, తాను ఏదీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చేయనని అన్నారాయన... సంగారెడ్డి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ బస్సుయాత్ర ఈనెల 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఉంటుందని, పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story