MLC Kavitha: ఈడీ విచారణలో హైడ్రామా.. ఉదయం నుంచి మంత్రులతో కవిత చర్చ

MLC Kavitha: ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్సీ కవిత

Jyothi
Published on: 16 March 2023 1:16 PM IST
Hydrama in ED Investigation
X

MLC Kavitha: ఈడీ విచారణలో హైడ్రామా.. ఉదయం నుంచి మంత్రులతో కవిత చర్చ

MLC Kavitha: ఈడీ విచారణలో హైడ్రామా నడిచింది. ఉదయం నుంచి మంత్రులతో చర్చించిన కవిత.. ఈడీ విచారణకు హాజరుకాలేదు. కేటీఆర్, హరీష్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతితో పాటు ఎంపీలతో కలిసి కార్యాచరణపై చర్చించారు. అనంతరం అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని ఈడీకి తెలిపారు. మొదట ఉదయం 10 గంటలకు ప్రెస్‌మీట్ ఉంటుందని చెప్పిన కవిత... న్యాయనిపుణులతో సమావేశం తర్వాత ఈడీకి లేఖ రాశారు. 11:30 నిమిషాలకి కవిత లేఖతో ఈడీ ఆఫీసుకు సోమా భరత్ బయలుదేరారు. 11.40కి ఈడీ అధికారులను కలిసి కవిత లేఖను అందజేశారు. దీంతో 11.57 నిమిషాలకి కేసీఆర్ నివాసం నుంచి ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్‌ వాహనం వెళ్లిపోయింది.

Jyothi

Jyothi

Next Story