AV Ranganath: ‘హైడ్రా’ భయంతో మహిళ ఆత్మహత్య.. స్పందించిన కమిషనర్‌ రంగనాథ్‌

AV Ranganath: కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Sept 2024 11:35 AM IST
Hydraa Commissioner Ranganath Reacted to the Woman Suicide
X

AV Ranganath: ‘హైడ్రా’ భయంతో మహిళ ఆత్మహత్య.. స్పందించిన కమిషనర్‌ రంగనాథ్‌

AV Ranganath: కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కూకట్‌పల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ అంశంలో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. తమ ఇళ్లను కూల్చివేస్తారేమోనని ఆ మహిళ కూతుళ్లుకు భయం కలిగి... దాని గురించి.. తల్లిని ప్రశ్నించారు. కూతుళ‌్ల ప్రశ్నలకు ఆవేదన చెందిన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

అయితే ఆమె కుమార్తెలు FTLకు దూరంగా కూకట్‌పల్లి సరస్సు సమీపంలోనే ఉంటున్నారని స్థానిక విచారణలో తేలింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కూల్చివేత హైడ్రాకు ఆపాదిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మూసీ నది పరిధిలోని ఇళ్లను కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తున్నట్లు అనేక తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు. కూల్చివేత కోసం మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా ఛానెళ్లు స్వార్థ ప్రయోజనాలే ఎజెండాగా హైడ్రాపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story