నాదర్‌గుల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. తమకు న్యాయం జరగడంపై బాధితుల హర్షం

నాదర్‌గుల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. తమకు న్యాయం జరగడంపై బాధితుల హర్షం
x
Highlights

HYDRA: హైదారాబాద్‌లో అక్రమ కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు.

HYDRA: హైదారాబాద్‌లో అక్రమ కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. బడంగ్‌పేట్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్‌గుల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 1986లో టెలికాం కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్‌ను దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది. అయితే, 2016లో ధరణి ద్వారా అక్రమ పాస్‌బుక్‌లు సృష్టించి, సొసైటీకి చెందిన భూమిలో మరో కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో దాదాపు 23 ఇంటి నిర్మాణ అనుమతులు అక్రమంగా పొందారు. దీంతో అక్రమాలను గమనించిన అసలైన ప్లాట్‌ యజమానులు.. కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు హైడ్రా అధికారులను ఆశ్రయించారు. దీనిపై హైడ్రా అధికారులు సమగ్ర విచారణ జరిపి.. అక్రమంగా మంజూరైన పర్మిషన్లను రద్దు చేసి, అసలైన యజమానులకు వారి ప్లాట్లను తిరిగి అందజేశారు. తమకు న్యాయం జరగడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories