Bathukamma: సరూర్‌నగర్‌ మైదానంలో బతుకమ్మ సంబురాలు.. రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం

Bathukamma: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించింది.

Arun Chilukuri
Published on: 30 Sept 2025 7:20 AM IST
Bathukamma: సరూర్‌నగర్‌ మైదానంలో బతుకమ్మ సంబురాలు.. రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం
X

Bathukamma: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు.

ఒకేసారి 10వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మంత్రి సీతక్క బతుకమ్మపాట పాడి అలరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story