భర్తతో తల్లి వివాహేతర సంబంధం.. నవ వధువు ఆత్మహత్య

Arun Chilukuri
Updated on: 14 March 2020 4:47 PM IST
భర్తతో తల్లి వివాహేతర సంబంధం.. నవ వధువు ఆత్మహత్య
X

తల్లి, భర్త ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురైన ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీర్‌పేటలో జరిగింది. మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటోంది. అనిత క్యాటరింగ్‌ పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు. ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందన(19)ను నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1న వివాహం జరిపించింది.

అయితే వివాహమైన తరువాత కూడా అనిత, నవీన్ కుమార్‌ల వివాహేతర సంబంధం కొనసాగేది. ఇది గమనించిన వందన విడిగా ఉందామని భర్తకు చెప్పగా ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానంటూ అనిత బెదిరించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్ నోట్ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story