TS News: అరబ్ కంట్రీలో హైదరాబాద్ అమ్మాయికి వరకట్న వేధింపులు..

TS News: గాయపడిన వీడియోను తల్లిదండ్రులకు పంపిడంతో వెలుగులోకి వచ్చిన ఘటన

Shekhar G
Updated on: 9 March 2024 4:01 PM IST
Hyderabad Woman Attacked By Her Husband In Arab Country
X

TS News: అరబ్ కంట్రీలో హైదరాబాద్ అమ్మాయికి వరకట్న వేధింపులు.. 

TS News: అరబ్ కంట్రీలో హైదరాబాద్ అమ్మాయికి భర్త వరకట్న వేధింపులు పెడుతున్నాడు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని అరబ్ కంట్రీకి చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం చేశారు. కట్నం తేలేదంటూ సబా బేగమ్‌ను భర్త చిత్ర హింసలు పెడుతున్నాడు.

కనీసం తిండికూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్‌తో ఆమెను భర్త చితకబాదాడు. భార్యపై ప్రతి రోజు భర్త దాడికి పాల్పడుతున్నాడు. విదేశాంగ మంత్రికి తల్లి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన‌ కూతురిని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో పేర్కొంది. భర్త నుంచి తన కూతురని ఎలాగైనా కాపాడాలని కోరింది. గాయపడిన వీడియోను సబా బేగం తల్లిదండ్రులకు పంపిచడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Shekhar G

Shekhar G

Next Story