Vajresh Yadav: అసమర్థ పాలనతో విశ్వ నగరం విషాద నగరంగా మారింది..

Thotakura Vajresh Yadav: బీఆర్ఎస్‌ అసమర్థ పాలనతో విశ్వ నగరంగా పిలవబడే హైదరాబాద్ విషాద నగరంగా మారిందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.

Arun Chilukuri
Published on: 28 July 2023 1:27 PM IST
Hyderabad Turned Into City of Floods in BRS Rule Says TPCC State Vice President Thotakura Vajresh Yadav
X

Vajresh Yadav: అసమర్థ పాలనతో విశ్వ నగరం విషాద నగరంగా మారింది..

Thotakura Vajresh Yadav: బీఆర్ఎస్‌ అసమర్థ పాలనతో విశ్వ నగరంగా పిలవబడే హైదరాబాద్ విషాద నగరంగా మారిందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పదివేల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ, గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం తలపెట్టిన జీహెచ్ఎంసీ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి అమరవీరుల స్థూపం నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాదులోని రోడ్లు చెరువులను తలపిస్తూ మాన్ హోల్ లో పడి ఎంతోమంది మృతి చెందినా పట్టించుకునే నాధుడే కరవయ్యాడన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story