Hyderabad: ఫిలింనగర్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో వాతలు..

Hyderabad: ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 12 Dec 2025 11:47 AM IST
Hyderabad: ఫిలింనగర్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో వాతలు..
X

Hyderabad: ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది. ఓ ట్యూషన్ టీచర్ ఏడేళ్ల బాలుడి అట్లకాడతో వాతలు పెట్టింది. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి తేజ నందన్ చదవటం లేదనే కారణంతో చేతులు, కాళ్ళు, ముఖంపై ఇలా శరీరంపై 8 చోట్ల కాల్చింది. దీంతో తేజ నందన్‌ నడవలేకపోవటంతో.. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ట్యూషన్ టీచర్ మానసపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్యూషన్ టీచర్ మానసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story