Hyderabad: జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపల్

Hyderabad: జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపల్
Hyderabad: జుట్టు ఎక్కువగా ఉందన్న నెపంతో ఒక విద్యార్థికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బలవంతంగా గుండు కొట్టించిన ఘటన నగరంలోని హఫీజ్‌పేట్‌లో కలకలం సృష్టించింది.
Hyderabad: జుట్టు ఎక్కువగా ఉందన్న నెపంతో ఒక విద్యార్థికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బలవంతంగా గుండు కొట్టించిన ఘటన నగరంలోని హఫీజ్‌పేట్‌లో కలకలం సృష్టించింది. దేవుడి మొక్కు ఉందని చెప్పినా వినకుండా విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
హఫీజ్‌పేట్ ప్రేమ్ నగర్ బీ-బ్లాక్‌లోని 'బ్లాక్ బోర్డ్ ది స్కూల్'లో ఈశ్వర్ అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడి జుట్టు కొంచెం ఎక్కువగా ఉండటంతో, కటింగ్ చేయించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించాడు. అయితే, తనకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి తలనీలాలు సమర్పించే మొక్కు ఉందని, అందుకే కటింగ్ చేయించుకోలేదని ఆ విద్యార్థి వివరణ ఇచ్చాడు.
బలవంతంగా గుండు.. స్కూల్ ముందు ఆందోళన
విద్యార్థి మొక్కు గురించి చెప్పినప్పటికీ ప్రిన్సిపాల్ కనికరించలేదు. నిబంధనల పేరుతో బాలుడికి బలవంతంగా గుండు కొట్టించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. "మొక్కు ఉందని మొత్తుకున్నా వినకుండా మా పిల్లాడి మనోభావాలను దెబ్బతీస్తారా?" అంటూ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు.
పాఠశాల ముందు బాధితులు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి, పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



