Rains in Telangana: తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు

Rains for Four days in Telanagana
x

Rains in Telangana:(File Image) 

Highlights

Rains in Telangana: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Rains in Telangana: తెలంగాణ లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుండి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధరణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటి నాటికి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్టు ఇస్రో వాతవరణ నిపుణులు తెలిపారు.

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డితో పాటు వరంగల్, ఖమ్మం ,ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతవరణ శాఖ కూడ ప్రకటించింది.

ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని అందుకే ముందస్తు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో శుక్రవారం ఆల్పపీడనం ఎర్పడనుందని, అది బలపడి తుఫాన్ గా మారనుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ లో వర్షపడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories