Hyderabad Rains ALERT: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు అలర్ట్‌.. గంటలో ప్రారంభం కానున్న వానలు

Hyderabad Rains ALERT
x

Hyderabad Rains ALERT: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు అలర్ట్‌.. గంటలో ప్రారంభం కానున్న వానలు

Highlights

Hyderabad Rains ALERT: నగర వాసులు జాగ్రత్త! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని పలు ప్రాంతాల్లో త్వరలోనే భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

Hyderabad Rains ALERT: నగర వాసులు జాగ్రత్త! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని పలు ప్రాంతాల్లో త్వరలోనే భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఒక గంటలోనే కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ఏఏ ప్రాంతాల్లో వర్షం కురిసే సూచనలున్నాయంటే?

బిరంగూడ, ఆర్‌సీ పురం, మియాపూర్, సెరిలింగంపల్లి, హయత్‌నగర్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, షంషాబాద్, రాజేంద్రనగర్‌ వంటి ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పిడుగులు, గాలులతో కూడిన వానలు కూడా ఎదురవచ్చునని సూచిస్తున్నారు.



ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షభారీ పరిస్థితుల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో సహాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.


వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశమున్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories