సాధారణ స్థితికి చేరుకున్న బల్కంపేట ఎల్లమ్మ గుడి!

X
Highlights
Hyderabad Rain Effect : భారీ వర్షాలతో నిన్న ఆలయంలోకి భారీగా వరదనీరు ఆలయాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
admin15 Oct 2020 6:29 AM GMT
Hyderabad Rain Effect : వరదనీటిలో మునిగిన బల్కంపేట ఎల్లమ్మ గుడిలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. భారీ వర్షాలతో నిన్న గర్భగుడిలోకి నీరు చేరగా అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దాంతో వరదనీటిలోనే అమ్మవారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అయితే నిన్నటి నుంచి వర‌్షం నిలిచిపోవటంతో.. ఇప్పుడు ఆలయంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారులు గుడిలోకి చేరిన నీటిని తొలగించారు. ఇక గుడిలోకి వరదనీరు చేరిన నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయాన్ని పరిశీలించారు. అధికారులను అక్కడి పరిస్థితి గురించి ఆరా తీశారు.
Web TitleHyderabad rain effect Conditions normal to Bulkampeta Ellamma temple
Next Story