వనస్థలిపురంలో మీసేవ సెంటర్ దగ్గర ఉద్రిక్తత

X
Highlights
హైదరాబాద్ వనస్థలిపురంలోని మీసేవ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద సహాయం కోసం పెద్దఎత్తున మీసేవ...
Arun Chilukuri18 Nov 2020 9:24 AM GMT
హైదరాబాద్ వనస్థలిపురంలోని మీసేవ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద సహాయం కోసం పెద్దఎత్తున మీసేవ సెంటర్ దగ్గరకు చేరుకున్నారు. గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా మహిళలంతా లోపలికి దూసుకెళ్లారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వరద సాయం కోసం పెద్ద సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు.
హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రాలన్నీ వరద బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. మీ సేవ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న బాధితులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్దిదారులు మీ సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు. దీంతో మీ సేవ సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు సర్వర్లు కూడా మొరాయిస్తుండడంతో పేర్లు నమోదులో మరింత ఆలస్యం జరుగుతోంది.
Web TitleHyderabad: Public Queue Up At Mee Seva Centres For Flood Relief Aid
Next Story