Hyderabad: కిలాడీ లేడీ శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

కిట్టి పార్టీల పేరుతో అమాయకులకు టోకరా..కోట్లు కొట్టేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి

Sandeep Reddy
Updated on: 3 Dec 2021 12:30 PM IST
Hyderabad Police Taking  into The Custody Shilpa Chaudhary
X

రెండ్రోజుల పాటు శిల్పా చౌదరిని విచారించనున్న పోలీసులు (ఫోటో-ది హన్స్ ఇండియా)

Hyderabad: కిలాడీ లేడీ శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్నారు నార్సింగ్‌ పోలీసులు. రెండ్రోజుల పాటు శిల్పా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి, కోట్లు కొట్టేసినట్టు శిల్పా చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో శిల్పా చౌదరి బ్యాంక్‌ లావాదేవీలపై కూడా కూపీ లాగుతున్నారు నార్సింగ్‌ పోలీసులు.

శిల్పా బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. కొంత మంది బయటకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో శిల్పా చౌదరికి చెందిన ఆరు బ్యాంక్ అకౌంట్లపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story