జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు : సీపీ అంజనీకుమార్

X
Highlights
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ ...
Arun Chilukuri29 Nov 2020 2:12 PM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 22 వేల మంది పోలీస్ లతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89 వార్డ్ లు ఉన్నాయని, మొత్తం పోలింగ్ స్టేషన్ లు 4 వేల 979 ఉన్నాయని సీపీ తెలిపారు. 2016 తో పోలిస్తే 817 కొత్త పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసినట్లు వివరించిన సీపీ.. నార్మల్ పోలింగ్ స్టేషన్ లు 2146, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 167 ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ చేశామని, కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Web TitleHyderabad police ready ghmc polls says, CP Anjani Kumar
Next Story