Telangana News: రోడ్డుపై దొరికిన హ్యాండ్‌ బ్యాగ్‌..

Telangana News: తెలంగాణ డీజీపీ ఆఫీసు దగ్గర ఓ మహిళ పోగొట్టుకున్న హ్యాండ్‌ బ్యాగ్‌ను పోలీసులు క్షేమంగా బాధితురాలికి తిరిగి అందజేశారు.

Arun Chilukuri
Updated on: 12 Sept 2022 8:00 PM IST
Hyderabad Police Handover Handbag Lost by Woman
X

Telangana News: రోడ్డుపై దొరికిన హ్యాండ్‌ బ్యాగ్‌..

Telangana News: తెలంగాణ డీజీపీ ఆఫీసు దగ్గర ఓ మహిళ పోగొట్టుకున్న హ్యాండ్‌ బ్యాగ్‌ను పోలీసులు క్షేమంగా బాధితురాలికి తిరిగి అందజేశారు. డీజీపీ ఆఫీసు దగ్గర ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా హ్యాండ్ బ్యాగ్ కిందపడిపోవడంతో అది గమనించిన ఆటో డ్రైవర్ దాన్ని తీసుకునేందుకు పరుగులు పెట్టారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు గమనించి వెళ్లడంతో బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ వదిలేసి పారిపోయాడు. బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు సైఫాబాద్ పోలీసులకు అందజేశారు. బ్యాగులో 4 తులాల గోల్డ్, ఒక వెండి గ్లాస్, 10వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. అయితే సదరు మహిళ డయల్ 100కి ఫోన్ చేయడంతో సైఫాబాద్ పోలీసులు బ్యాగును బాధితురాలికి అందజేశారు. పోగొట్టుకున్న బ్యాగును అందించిన పోలీసులకు బాధితురాలు కృతజ్జతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story