డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు...

Hyderabad Police Cracked Drugs Gang Arrested 2 Members | Hyderabad Drugs Latest News
x

డ్రగ్స్ ముఠాను గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు...

Highlights

Hyderabad Police: డ్రగ్స్ దందా చేస్తున్న రెండు గ్యాంగ్‌లకు చెందిన ఇద్దరు అరెస్ట్...

Hyderabad Police: డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. డ్రగ్స్‌ దందా నడుపుతున్న రెండు గ్యాంగులకు చెందిన ఇద్దరు వేరు, వేరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ప్రేమ్‌ ఉపాధ్. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ.. డ్రగ్స్‌ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక.. ప్రేమ్‌ నుంచి రామకృష్ణ, నిఖిల్‌, జీవన్‌ డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు సమాచారం సేకరించారు. అయితే.. ఇవాళ మృతిచెందిన బీటెక్‌ విద్యార్థి.. ప్రేమ్‌ స్నేహితుడని పోలీసులు తెలిపారు.

ప్రేమ్‌తో పాటు గోవాలో మల్టిపుల్‌ డ్రగ్స్‌ తీసుకున్నాడని అన్నారు. అతిగా డ్రగ్స్‌ తీసుకోవడంతో అనారోగ్యానికి గురై, వారం రోజుల్లోనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడని స్పష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్‌ కీలక సూత్రధారి లక్ష్మీపతి పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. గోవాకు మొత్తం 9 మంది బ్యాచ్‌ వెళ్లగా.. వీరిలో ఒక యువకుడు మృతి చెందాడు. మిగిలిన 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories