Fake DSP: ఇంటర్మిడియట్‌తోనే డీఎస్పీ.. పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్...!

Fake DSP: ఇంటర్ కూడా పాస్‌ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్‌లో రెచ్చిపోయాడు.

Arun Chilukuri
Published on: 17 July 2021 5:19 PM IST
Hyderabad Police Arrested Fake DSP
X

Fake DSP: ఇంటర్మిడియట్‌తోనే డీఎస్పీ.. పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్...!

Fake DSP: ఇంటర్ కూడా పాస్‌ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్‌లో రెచ్చిపోయాడు. నిరుద్యోగులే టార్గెట్‌గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు. 20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు. మొత్తానికి ఈ కేటుగాడి పాపం పండడంతో కటకటాల ఊచలు లెక్కిస్తున్నాడు.

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్‌కు చెందిన నిందితుడు నెల్లూరు స్వామి డీఎస్పీ డ్రెస్‌లో వాహనాన్ని పెట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం, సెటిల్మెంట్ చేయడంపై ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పాస్ కాని వ్యక్తి డీఎస్పీ కావడమేంటని బాధితులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నెల్లూరు స్వామిని అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story