Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇంటిపై దాడి

Asaduddin Owaisi: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్‌ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Jun 2024 12:20 PM IST
Hyderabad MP Asaduddin Owaisis Delhi Residence Vandalised With Ink
X

Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇంటిపై దాడి

Asaduddin Owaisi: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్‌ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అసదుద్దీన్‌ ఇంటిపై ఇంక్‌ చల్లి పారిపోయినట్లు తెలుస్తోంది. భారత్‌ మాతా కీ జై, జై ఇజ్రాయెల్‌ అని రాసి ఉన్న.. పోస్టర్లను ఇంటి గోడలకు దుండగులు అతికించారు. ఈ ఘటనపై ఎంపీ అసద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తన నివాసంపై టార్గెట్ చేస్తూ పదేపదే దాడులు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందో లేదో చెప్పాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని, ఈ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరా చుక్కలు చల్లడం వంటివి చేసిన తర్వాత పారిపోకుండా తనను నేరుగా ఎదుర్కొంవాలని సవాల్‌ విసిరారు ఓవైసీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story