Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా ప్రయాణం..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.

Arun Chilukuri
Published on: 31 March 2022 8:53 PM IST
Hyderabad Metro to offer unlimited holiday travel for Rs 59
X

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా ప్రయాణం..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌. హైదరాబాద్‌ మెట్రో రైల్లో 'సూపర్ సేవర్‌ కార్డు' పేరుతో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది మెట్రో రైల్. ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి సూపర్ సేవర్‌ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగే ఛాన్సుంది. అయితే ఈ ఆఫర్ మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే వర్తిస్తుంది. ప్రతి ఆదివారం, ప్రతి రెండు.. నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, పంద్రా ఆగస్ట్, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story