Top
logo

హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌లో మరో ముందడుగు

హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌లో మరో ముందడుగు
X
Highlights

మెట్రో కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది.

హైటెక్‌సిటీ మెట్రో కారిడార్‌లో మెట్రో రైలు మరింత ముందుకు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం సైబర్‌ టవర్స్‌ వరకు వెళ్తున్న మెట్రో రైలు, త్వరలోనే మైండ్‌స్పేస్‌ వరకు రాకపోకలు సాగించనుంది. 1.5 కి.మీ మేర నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈనెల 29 మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌లు మెట్రో రైలు సేవలను ప్రారంభించనున్నారు.

మెట్రో కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ ఉద్యోగులు షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు మైండ్‌స్పేస్ జంక్షన్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత ఈజీ అవుతుంది.

Web TitleHyderabad Metro Rail is another advance
Next Story