మేయర్ విజయలక్ష్మికి రూ.లక్ష జరిమానా

Arun Chilukuri
Published on: 13 Feb 2021 2:53 PM IST
మేయర్ విజయలక్ష్మికి రూ.లక్ష జరిమానా
X

మేయర్ విజయలక్ష్మికి రూ.లక్ష జరిమానా

జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి బల్దియా అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. గ్రేటర్ పరిధిలో మేయర్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కు లక్ష రూపాయలు ఫైన్ వేశారు. ఈ నెల 11న జరిగిన మేయర్‌ ఎన్నికలో భాగంగా బంజారాహిల్స్‌ టీఆర్ఎస్ కార్పొరేటర్‌, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ కొత్త మేయర్‌ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ జంట నగరాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజెన్లు ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో సంబంధిత అధికారులు స్పందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story