Hyderabad Mayor Visits Thirupathi: శ్రీవారిని దర్శించుకున్న మేయర్‌..

Hyderabad Mayor Visits Thirupathi: హైదరాబాద్ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి మలయప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.

Sumitra
Updated on: 5 July 2020 5:50 PM IST
Hyderabad Mayor Visits Thirupathi: శ్రీవారిని దర్శించుకున్న మేయర్‌..
X

Hyderabad Mayor Visits Thirupathi: హైదరాబాద్ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి మలయప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన 48వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి పట్టు వస్ర్తాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి ఆశిస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.

ఇక హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జన్మదినం సందర్భంగా పలువులు నాయకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 48వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏంపీ సంతోష్ ట్విటర్ ను వేదికగా చేసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, మంచి ఆరోగ్యంతో ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు ఈ పుట్టినరోజున మరో మూడు మొక్కలను జీవితం లభిస్తే ఎలా ఉంటుంది? అంటూ సంతోష్‌ కుమార్‌ మేయర్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. ఆయనతో పాటు పలువులు పార్టీ ప్రధాన నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయన అనుచరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపారు.

Sumitra

Sumitra

Next Story