నా శవాన్ని తాకే అర్హత భర్తకు లేదు.. అతడో రాక్షసుడు..

Hyderabad: భర్త వేధింపులు తట్టుకోలేక మూడునెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది.

Arun Chilukuri
Published on: 4 Aug 2022 2:27 PM IST
Hyderabad Married Woman Commits Suicide
X

నా శవాన్ని తాకే అర్హత భర్తకు లేదు.. అతడో రాక్షసుడు..

Hyderabad: భర్త వేధింపులు తట్టుకోలేక మూడునెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడు, అతడికి తన మృతదేహాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో రాసుకుంది. కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. షాహిన్ నగర్‌ జుబైద్ కాలనీకి చెందిన ఫిర్దోస్ అన్సారీకి చార్మినార్ ఫతే దర్వాజకు చెందిన సుల్తాన్ పటేల్‌తో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. ఎవరితో మాట్లాడినా భర్త అనుమనించే వాడు. సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఎవరికైనా చెప్తే రివాల్వర్‌తో చంపుతానంటూ బెదిరించేవాడు.

ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను అందరికీ చూపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇటీవల ఫిర్దోస్ అన్సారీ గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. భార్యను కలవడానికి వచ్చిన సుల్తాన్ ఫిర్దోస్‌ను చితకబాదాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే వారు సర్దుకుపోవాలని నచ్చజెప్పారు. మనోవేదనకు గురైన అన్సారీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాల్ని డైరీలో రాసుకుంది. డైరీలో ఆమె వేదన వివరించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story