London: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!

Hyderabad Man Mohd Khaja Rayees Uddin Killed In London Ahead Of Daughter Marriage
x

London: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!

Highlights

London: కుమార్తె పెళ్లి కోసం హైదరాబాద్‌ వచ్చే సమయంలో హత్య

London: హైదరాబాద్‌కు చెందిన రైసుద్దీన్ అనే వ్యక్తి లండన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి నిమిత్తం లండన్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌ వాసిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. దీంతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. రైసుద్దీన్ తన స్నేహితుడితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వారిద్దరినీ విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. అయితే ఈ నెలలోనే రైసుద్దీన్ కూతురు పెళ్లి నిశ్చయించారు. కూతురు పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చే సమయంలో దుండగులు రైసుద్దీన్‌పై దాడి చేసి నగదు దోచుకున్నారు. మరోవైపు కుమార్తె పెళ్లి ఏర్పాట్లులో రైసుద్దీన్ కుటుంబసభ్యులు నిమగ్నమయ్యారు. ఇంతలోనే రైసుద్దీన్ మరణవార్తతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. రైసుద్దీన్ మృతదేహన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories