మహంకాళి పీఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం

Telangana: బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

Jyothi
Updated on: 24 Dec 2022 12:09 PM IST
Hyderabad Kidnapped Girl Rescued Mahakali Police
X

మహంకాళి పీఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం

Telangana: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలికను మహంకాళి ఏసీపీ రమేష్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ కు గురైన కొద్ది గంటల్లో పోలీసులు ట్రెస్ చేశారు. కిడ్నాపర్ రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట నుండి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ కు బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలిక తల్లిదండ్రులను, బంధువులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. బాలిక దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని అందుకు మన తెలంగాణ పోలీసును అభినందిస్తున్నానని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Jyothi

Jyothi

Next Story