Hyderabad: గాల్లో కార్ పార్కింగా? ఇలా చేస్తే హైద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ఇక ఉండవు

Hyderabad
x

Hyderabad: గాల్లో కార్ పార్కింగా? ఇలా చేస్తే హైద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ఇక ఉండవు

Highlights

Hyderabad: హైదారాబాద్ ఎంత పెద్దగా విస్తరిస్తున్నా ట్రాఫిక్ సమస్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతుంది. ముఖ్యంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, లకిడికపూల్ ఇలాంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది

Hyderabad: హైదారాబాద్ ఎంత పెద్దగా విస్తరిస్తున్నా ట్రాఫిక్ సమస్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతుంది. ముఖ్యంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, లకిడికపూల్ ఇలాంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అరగంటలో ఇంటికెళ్లాల్సిన వాళ్లు ఒక్కోసారి 2 గంటలైనా ఇంటికి వెళ్లలేకపోతున్నారు. అయితే ఇప్పుడు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు జీహెచ్ఎమ్‌సి సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి అలాగే పార్కింగ్ ఫెసిలిటి పెంచడానికి జిహెచ్ఎమ్‌సి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌ని సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే కేజీఆర్ పార్క్ దగ్గర గేట్ నెంబర్1 వద్ద దీన్ని కొత్తగా నిర్మించింది. అయితే ఇప్పుడు ట్రయిల్ దశ నడుస్తుంది. ఉదయమే కేబీఆర్ పార్క్ వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరగడం, ఇక్కడ కార్లు రోడ్లపైనే నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలనే ముందుగా ఈ ప్రాజెక్ట్ ను ఇక్కడ లాంచ్ చేసింది. 15 మీటర్ల ఎత్తులో కార్లను పార్కింగ్ చేయొచ్చు. కింద నుంచి పైకి ఈ కార్లు వెళ్లిపోతాయి. జాగింగ్‌కు వచ్చినవారు ఇక్కడ ఫ్రీగా కార్లను పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రయిల్ దశ కాబట్టి ఇంకా అందరూ ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. ఇదే గనక సక్సస్ అయితే నగరవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులను జీహెచ్ ఎమ్ సి పెట్టే అవకాశం. దీనివల్ల చాలా ట్రాఫిక్ తగ్గుతుంది.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం పార్కింగ్ లేకపోవడమే. చాలా ప్రాంతాల్లో చాలామంది పార్కింగ్ లేక రోడ్లపైనే కార్లను పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నగరవాసులకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఇప్పడు జీహెచ్ఎమ్‌సి ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories