Hyderabad: నగరంలో ఐటీ దాడుల కలకలం.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 11:14 AM IST
Hyderabad: నగరంలో ఐటీ దాడుల కలకలం.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు
X

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. వుడ్‌ బ్రిడ్జ్‌ హోటల్‌ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హోటల్‌ ఓనర్‌ హర్షద్‌ అలీఖాన్‌ను విచారించారు. గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు.

ఇటీవలే ప్రముఖ హోటల్స్‌ యజమానులను విచారించారు ఐటీ అధికారులు. మెహఫిల్‌, పిస్తా హౌస్, షా గౌస్‌ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు, డాక్యుమెంట్లను గుర్తించారు అధికారులు. వీరితో లింక్స్‌ ఉన్న హోటళ్లపై సైతం ఫోకస్‌ పెట్టిన ఐటీ అధికారులు.. వుడ్‌ బ్రిడ్జ్‌ హోటల్‌ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story