Hyderabad: వినాయక చవితి వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం

Hyderabad is Getting Ready for the Vinayaka Chavithi Celebrations
x

వినాయక చవితి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: ఖైరతాబాద్ విగ్రహ ఏర్పాట్లు దాదాపు పూర్తి * ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్‌లో వేల సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం

Hyderabad: వినాయక చవితి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఇప్పటికే విగ్రహాల తయారీ, మండపాల ఏర్పాట్లు పనులు కొనసాగుతున్నాయి. అయితే నవరాత్రి ఉత్సవాలు తర్వాత జరిగే వినాయక నిమజ్జనం అంటే మొదట గుర్తుకొచ్చేది హుస్సేన్ సాగర్. ఏటా లక్షలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అవుతుంటాయి. అసలే కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్ సాగర్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ప్రకృతి ప్రేమికుల పిటిషన్లను విచారించిన హైకోర్టు సాగరంలో నిమజ్జనంపై రెండేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశిస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది.

ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా హుస్సేన్‌సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని అయితే 6వ తేదీన వచ్చే తీర్పును బట్టి ముందుకెళ్తామంటున్నారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. మరోవైపు గణేష్ నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్‌సాగర్‌ వద్ద GHMC అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఖైరతాబాద్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తామని, అనంతరం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories