Hyderabad: మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం.. ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad: హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 17 Dec 2025 11:57 AM IST
Hyderabad: మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం.. ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి
X

Hyderabad: హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే స్వెటర్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో దీపక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారులో ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story