Hyderabad: బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టిన ఇంటి ఓనర్

Hyderabad: బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టిన ఇంటి ఓనర్
x
Highlights

Hyderabad:హైదరాబాద్‌ను కుదిపేసిన మరో ఘోర సంఘటన బయటపడింది. మధురానగర్‌లో ఓ ఇంటి యజమాని అమానుష కృత్యానికి పాల్పడ్డాడు.

Hyderabad:హైదరాబాద్‌ను కుదిపేసిన మరో ఘోర సంఘటన బయటపడింది. మధురానగర్‌లో ఓ ఇంటి యజమాని అమానుష కృత్యానికి పాల్పడ్డాడు. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేశాడు. విషయం బయటపడటంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. జవహర్‌నగర్‌కు చెందిన అశోక్‌ అనే వ్యక్తి ఇంట్లో ఓ దంపతులు అద్దెకు ఉంటున్నారు.

ఈ నెల 4న బాత్రూం లైట్ పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి తెలియజేశారు. అతడు ఎలక్ట్రీషియన్‌ను పిలిచి లైట్ రిపేర్ చేయించాడు. కానీ అక్టోబర్‌ 13న బల్బ్‌ హోల్డర్‌ నుంచి స్క్రూ పడిపోవడంతో భర్త దాన్ని పరిశీలించగా, అందులో కెమెరా అమర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇంటి యజమానిని ప్రశ్నించగా, అతడు వారినే బెదిరించాడు. చివరికి భయపడిన దంపతులు జవహర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా భారీ చర్చకు దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories