Hyderabad Heavy Rains: భారీ వర్షంతో హైదరాబాద్‌ జంట జలాశయాలకు పోటెత్తిన వరద

Hyderabad Heavy Rains: భారీ వర్షంతో హైదరాబాద్‌ జంట జలాశయాలకు పోటెత్తిన వరద
x

Hyderabad Heavy Rains: భారీ వర్షంతో హైదరాబాద్‌ జంట జలాశయాలకు పోటెత్తిన వరద

Highlights

Hyderabad Heavy Rains: భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద పోటెత్తింది.

Hyderabad Heavy Rains: భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. నిన్న మధ్యాహ్నం నుంచి GHMC పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాలకు వరద పోటెత్తడంతో.. హిమాయత్ సాగర్, గండిపేట చెరువులు నిండుకుండలా మారాయి. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 అడుగుల మేర.. హిమాయత్ సాగర్ మూడు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 17 వందల 90 అడుగులు కాగా.. ప్రస్తుతం వరద 17వందల 89 అడుగులకు చేరుకుంది. 15 వందల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా..13 వందల 52 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఇక హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 17 వందల 63 అడుగులు కాగా.. దాదాపు ఫుల్ కెపాసిటీ నిండిపోయింది. హిమాయత్ సాగర్‌కు 5 వేల 5 వందల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇక భారీగా వరదనీరు జంట జలాశయాల నుంచి విడుదల చేసిన అధికారులు.. జంట జలాశయాల పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూసీలోకి వరద వెళ్తుండటంతో.. పరివాహక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. హిమాయత్ సాగర్ నుంచి వరదనీటిని రిలీజ్ చేయడంతో.. సమీపంలో ORR సర్వీస్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జ్‌పై నుంచి వరద వెళ్తుండటంతో రాజేంద్రనగర్ నుండి నార్సింగి వెళ్లే సర్వీస్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్డులో ప్రయాణించేవారు రాజేంద్రనగర్, బుద్వేల్, కిస్మత్‌పూర్, బండ్లగూడ జాగిర్ మీదుగా రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories