హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం

Arun Chilukuri
Published on: 16 Oct 2020 2:57 PM IST
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం
X

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం వెలుగుచూసింది. స్నేహం ముసుగులో ఓ యువతిపై ముగ్గురు అత్యాచారం చేశారు. బర్త్ డే కేకులో మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టారు. విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. యువతి తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం గట్టిగా అడగడంతో యువతి అసలు వి‍షయం బయటపెట్టింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులు జోసెఫ్‌, రాము, నవీన్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story